నూతన హాస్టల్ భవనాన్ని వెంటనే నిర్మించాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్

Feb 26,2024 16:01 #Hostels, #Kakinada, #SFI

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ జగన్నాదపుర్ లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల కళాశాల హాస్టల్ కు నూతన భవన నిర్మించాలనీ కోరుతూ కలెక్టరేట్ లో ఎస్ఎఫ్ఐ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎమ్.గంగాసూరిబాబు, కాకినాడ నగర అధ్యక్షులు సంజయ్ సంయుక్తంగా మాట్లాడుతూ వెనుక బడిన తరగతుల కళాశాల బాలికల వసతి భవన్ శిధిలావస్తకు చేరుకుందన్నారు. ఈ భవనంలో సుమారు 100 కి పైగా విద్యార్థినులు ఉంటున్నారన్నారు. ఈ హాస్టల్ శిధిల వ్యవస్థకు చేరడంతో వర్షాలు వచ్చిన్నపుడు హాస్టల్ యొక్క స్లాబ్ నుంచి వర్షపు నీరు నేరుగా గదుల్లోకి చేరుతుందన్నారు. దీంతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే అనేకసార్లు అధికారులకు తెలియజేసిన కనీసం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నమని చెప్తూనే మరో పక్కనే సంక్షేమ హాస్టల్లను గాలికి వదిలేస్తుందన్నారు. భవనం శిథిల వ్యవస్థ చేరడం వల్ల విద్యార్థులకు ఏదైనా ప్రమాదం వాటిలితే ఎవరు బాధ్యత వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు హడావిడి చేయడం కాకుండా ముందుగానే అధికారులు కళ్ళు తెరిచి భవనాన్ని కూల్చివేసి నూతన భవన నిర్మించాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ గా డిమాండ్ చేశారు.

➡️