‘ఉండి’లో గెలుపెవరిది?

May 8,2024 17:32 #undi

ప్రజాశక్తి-కాళ్ళ
సార్వత్రిక ఎన్నికల పోరు హోరా హౌరీగా నడుస్తోంది. ఉండి నియోజకవర్గంలోఅధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి,ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ పార్టీ అభ్యర్డుల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా సాగుతోంది. క్షత్రియ సామాజిక తరగతికి చెందిన అభ్యర్థులను పోటీలోకి దింపాయి. రఘు రామకృష్ణం రాజు ఆర్థికంగా సంపన్నుడు కావడం, పోటీలో ఉన్న శివరామరాజు, నరసింహరాజు తమ శక్తికొద్దీ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధం కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఉండిలో టిడిపి కూటమి తరపున పోటీచేస్తున్న రఘురామకఅష్ణంరాజుకి అసమ్మతి పోటు ఉంది.వైసీపీ నుంచి పి వి ఎల్‌ నరసింహరాజు రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి సానుభూతి కలిసివస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. మూడో సారి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హోరా హోరీ పోరు వైసిపికి, బిజెపి-టిడిపి-జనసేన కూటమికి ఓటేయడానికి ఇష్టపడని వారు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ వైపు చూస్తున్నారు. దీంతో ఉండిలో హోరా హోరీ పోరు జరిగే అవకాశం ఉంది.ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ ఉత్కంఠగా వుంది. గత ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ స్థానాన్ని టిడిపి సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు పోటీలో లేరు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకఅష్ణంరాజు, వైసిపి నుంచి పివి ఎల్‌ నరసింహ రాజు, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీ పడుతున్నారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకఅష్ణంరాజు గెలిస్తే తమ రాజకీయ ఉనికికి ప్రమాదమన్న భయం టిడిపి నాయకత్వంలో మొదలైంది. బయటకు చెప్పుకోలేకపోయినా, ఆయన వ్యవహారశైలి ఇరకాటంలో పెట్టేలా వుందని టిడిపి నాయకులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. రఘురామ ఏకపక్ష వైఖరి రఘురామకఅష్ణంరాజు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుందని పలువురు విమర్శిస్తున్నారు. కొన్ని సామాజిక తరగతులను కలుపుకు పోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రత్యర్థి రాజకీయ చాణక్యాన్ని ఎదురొడ్డి ఎంతవరకు విజయ సాధిస్తారనేది చూడాలి. సంక్షేమమే వైసిపి నమ్మకంసంక్షేమ పథకాలు, వాలంటీర్లపైనే నమ్మకం వైసిపి అభ్యర్ధి పివి ఎల్‌ నరసింహరాజు సంక్షేమ పధకాల లబ్దిదారులను ఆకర్షించడం, వాలంటర్లను మచ్చిక చేసుకోవడంతోపాటు ఎన్నికలలో నెగ్గేందుకు పక్కా ప్రణాళికతో, పదనైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ ఇచ్చిన గడపగడపకు వంటి కార్యక్రమాలన్నింటికీ సద్వినియోగం చేసుకున్నారు.హామీలు గాలికి…నియోజకవర్గంలో ప్రధానంగా ఉప్పుటేరుప్రక్షాళన పనులు,ఆక్వా రైతుల ఇబ్బందులు, డెల్టా పరిధిలో తాగునీటి సమస్య, కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణం, రోడ్లు వంటి అనేక సమస్యలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. గత పదేళ్లలో టిడిపి ప్రభుత్వంగానీ, వైసిపి ప్రభుత్వంగానీ తమ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయలేదని ప్రజలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, సముద్రపు నీరు కొల్లేరులోకి ప్రవేశించకుండా రెగ్యులేటర్ల నిర్మాణం చేపడతామని, ఆక్వా రైతులను ఆదుకుంటామని, గోదావరి నుంచి పైప్‌లైన్‌ ద్వారా వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తామని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అనేక హామీలను వైసిపి గుప్పించింది. అయితే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. వ్యూహాలకు పదును ఓటర్లను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకునేందుకు వైసిపి, టిడిపి కూటమి, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వైసిపి అభ్యర్థులు చెపుతుండగా, పథకాల్లోని లోపాలను టిడిపి కూటమి అభ్యర్థులు తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. ఏ అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయో వేచిచూడాల్సి ఉంది. పోలింగ్‌కు ఇక ఐదు రోజులు కూడా లేకపోవడంతో ప్రచారం ఉధృతమైంది. అభ్యర్థులు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతావిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎంతో కొంత ఓటర్లపై ప్రభావం చూపిస్తారనే వాదన ఉంది. ఇప్పటికే ప్రచార బరిలో దిగిన వైసిపి, టిడిపి పార్టీలు ఒకరికి మించి ఒకరు ప్రచారం సాగిస్తున్నారు. వైసిపి పార్టీకి బలమైన అభ్యర్థితో పాటు, నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ పటిష్టమైన కేడర్‌ కలిగి ఉంది. ఈయనకు ఏ మేరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది.ప్రభుత్వ వ్యతిరేకత, ఉమ్మడి మేనిఫెస్టో పైనే ఆశలన్నీ టిడిపి అభ్యర్థి రఘురామకఅష్ణరాజు ప్రభుత్వ వ్యతిరేకత, ఉమ్మడి మేనిఫెస్టోపైనే ఆశలు పెట్టుకున్నారు.

➡️