చలివేళ వెచ్చని దుప్పటి

రోజురోజుకూ చలిగాలులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చలి నుంచి రక్షణ నిమిత్తం ప్రత్యేకంగా దుస్తులు ధరించాల్సి వుంటుంది. రాత్రిళ్లు చలి నుంచి వెచ్చదనం కోసం పిల్లలు, వృద్ధులు దుప్పట్లు కప్పుకోకపోతే చలిని భరించలేరు. నేడు అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్లలో తేలికపాటి దుప్పట్లు, రగ్గులు దొరుకుతున్నాయి. మార్కెట్లో లభిస్తున్న కొన్ని దుప్పట్ల గురించి తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్‌ బ్లాంకెట్స్‌ : కరెంట్‌ ఛార్జింగ్‌తోపాటుగా మాన్యువల్‌గా కూడా హీట్‌ కంట్రోల్‌తో ఇవి పనిచేస్తాయి. నాణ్యమైన ఎలక్ట్రిక్‌ బ్లాంకెట్లను మాత్రమే ఎంచుకోవాలనీ, లేనిపక్షంలో షార్ట్‌ సర్క్యూట్‌తోపాటు హీట్‌ ఎక్కువైతే ప్రమా దాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు.

సాఫ్ట్‌, బెస్ట్‌ బ్యాంకెట్స్‌ : తేలికపాటి ఉన్ని, ఫైబర్‌ దుప్పట్లు సైతం చలిని ఆపగలిగేవి ఉంటాయి. సాఫ్ట్‌ బ్యాంకెట్స్‌గా కూడా వీటిని పిలుస్తారు. చాలా తక్కువ ధరల్లోనూ దొరుకుతుంటాయి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారు ఈ దుప్పట్లను తీసుకెళ్తే తేలిగ్గా ఉంటాయి. చలినుంచి రక్షణకు దోహదపడతాయి.

సింగిల్‌ బెడ్‌ బ్యాంకెట్‌ : ఇది నాలుగు రంగుల సింగిల్‌ బెడ్‌ బ్యాంకెట్‌లతో కూడి గొప్ప కాంబో ప్యాక్‌. నాలుగు విభిన్న రంగులను కలిగివుంటుంది. మంచి ఉన్నితో చాలా మృదువుగా ఉంటాయి. ఒక్కో దుప్పటి 400 గ్రాముల వరకూ బరువు ఉంటుంది. చిన్న పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఎసి బ్యాంకెట్‌ : ఇది పోరార్‌ ప్లీస్‌ సింగిల్‌ బెడ్‌ బ్లాంకెట్‌. ఎసి గదికి చాలా బాగుంటుంది. శీతాకాలంలో టీవీ చూసేటప్పుడు కూడా ఈ దుప్పటిని వినియోగిం చొచ్చు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

లైట్‌ వెయిట్‌ సూపర్‌ సాఫ్ట్‌ లగ్జరీ బ్లాంకెట్‌ : ఇది తేలిగ్గా,మృదువుగా ఉంటుంది. ఇది ఎసి గదికి, సోఫాలో కూర్చుని టివి చూస్తున్నప్పుడు ఉపయోగించటానికి బాగుంటుంది. ఈ తేలికపాటి దుప్పటి పరిమాణం 90 అంగుళాల పొడవు, 78 అంగుళాల వెడల్పు ఉంటుంది.

ఆల్‌ సీజన్‌ పోరల్‌ ప్లీ బ్లాంకెట్‌ : ఇది అన్ని సీజన్లలోనూ ఉపయోగించటానికి అనువుగా ఉంటుంది. దీనిలోని ఫాబ్రిక్‌ పాలిస్టర్‌ చాలా వెచ్చని అనుభూతిని అందిస్తుంది. సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ దుప్పటిని మెషిన్‌ వాష్‌ కూడా చేసుకోవచ్చు.

➡️