ఎత్తిపోతల జలపాతం

May 5,2024 09:12 #paryatakam

నాగార్జునసాగర్‌ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉంది 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం. కృష్ణానది ఉపనది అయిన చంద్రవంకపై ఉంది. చంద్రవంక నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యంలో తాళ్ళపల్లి వద్ద 70 అడుగుల ఎత్తు నుండి పడి ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. ఇది తుమృకోటకు వాయువ్యాన కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది. యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతిం తపోం తలం (ఎత్తిపోతల) గా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది.

 

➡️