Electoral Bonds: రాష్ట్రంలో ఎవరికెంత?

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో కంపెనీల నుండి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు నిధులు అందాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇచ్చిన వివరాలను, కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పొందిపరిచిన వివరాల ప్రకారంఅధికారంలో ఉన్న వైసిపికి అత్యధికంగా 337కోట్ల రూపాయలను కంపెనీలు ఇవ్వగా, ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి 218.88 కోట్ల రూపాయలు అందాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జనసేనకు 21 కోట్ల రూపాయలను కంపెనీలు ఇచ్చాయి. వైసిపి ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున లబ్ధిపొందిందని టిడిపి పదేపదే ఆరోపించిన షిర్థిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ తనపై ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీకే ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో నిధులు అందిచడం విశేషం. ఆ సంస్థ నుండి టిడిపి 40 కోట్ల రూపాయలు అందాయి. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్న మేఘా సంస్థ వైసిపి, టిడిపి, జనసేన మూడు పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో నిధులు ఇచ్చింది. బిజెపికి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన ప్యూచర్‌ గేమింగ్‌ సంస్థ రాష్ట్రంలో వైసిపికి 154 కోట్ల రూపాయలు అందించింది. అదానికి చెందిన గ్రీన్‌ కో విండ్‌ నుండి కూడా వైసిపికి 10 కోట్ల రూపాయలు అందాయి, వైసిపికి 472 బాండ్ల రూపంలో, టిడిపికి 279 బాండ్ల రూపంలో. జనసేనకు 39 బాండ్లతో ఈ నిధులు సమకూరనాయి.
టిడిపికి ఇలా…
టిడిపికి 279 బాండ్ల రూపంలో రూ.218 కోట్లు విరాళాలు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 2019 ఏప్రిల్‌లో 19 బాండ్లు రూపంలో రూ.7.30 కోట్ల విరాళాలు వచ్చాయి. రూ.ఒక కోటి కంటే తక్కువ విరాళాలు వచ్చినవి 32 ఎంట్రీలు ఉన్నాయి. బిజెపి ఎంపి సిఎం రమేష్‌ కంపెనీ రిత్విక్‌ ప్రాజెక్టు నుంచి టిడిపికి విరాళాలు అందాయి.

➡️