T20 World Cup: పాకిస్థాన్‌ న్యూ జెర్సీ విడుదల..

May 7,2024 11:28 #Pakistan, #T20 world cup

టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టు న్యూ జెర్సీని రివీల్‌ చేసింది. మ్యాట్రిక్స్‌ జెర్సీ’ 24 పేరుతో పీసీబీ బోర్డ్‌ తమ కొత్త జెర్సీని సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజం, షాహీన్‌ అఫ్రిది, నసీమ్‌ షా లాంటి స్టార్‌ ప్లేయర్స్‌ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు షేర్‌ చేసింది. ఇక పాక్‌ న్యూ జెర్సీ.. వారి సాంప్రదాయ ఆకు పచ్చ రంగులో ఉండగా.. ఈ మెగా టోర్నమెంట్‌కు చెందిన లోగో.. జెర్సీ రైట్‌ సైడ్‌ ఉండగా.. పీసీబీ లోగో ఎడమ వైపు ఉంది. ఈ జెర్సీని పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌ పీసీబీ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొనింది.

➡️