రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ

Dec 13,2023 08:51 #Chief Minister, #Rajasthan

 జైపూర్‌ :  మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్‌ శర్మను రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ప్రకటించింది. మంగళవారం జైపూర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే భజన్‌లాల్‌ శర్మ పేరును ప్రతిపాదించగా.. కిరోడి లాల్‌ మీనా, ఇతర సీనియర్‌ నేతలు బలపరిచారు. భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన భజన్‌లాల్‌ శర్మ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి సంగనేర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దియా కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వాలను డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసినట్లు రక్షణ మంత్రి, సెంట్రల్‌ అబ్జర్వర్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్‌గా అజ్మేర్‌ నార్త్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వసుదేవ్‌ దేవ్నాని పేరుని ప్రకటించారు.

➡️