Lok Sabha Election : 3 గంటల సమయానికి 49.78 శాతం ఓటింగ్‌ నమోదు

న్యూఢిల్లీ :    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 49.78 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎల్‌ఇడి పేలడంతో సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ గాయపడినట్లు  అధికారులు తెలిపారు. సిఆర్‌పిఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఉన్న అధికారిని భైరామ్‌గఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిహ్కా పోలింగ్‌ స్టేషన్‌లో ఎన్నికల విధులు అప్పగించారు.

పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌, అలీపుర్‌ దువాయ్ , జల్పాయి గురి నియోజకవర్గాల్లో హింస, బెదిరింపులు, దాడికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.  కూచ్ బెహార్‌లో బిజెపి,  టిఎంసి మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయని అన్నారు.

➡️