సిఎస్‌, డిజిపిపై చర్యలు తీసుకోండి

  • ఇసికి ఎన్‌డిఎ కూటమి నేతల ఫిర్యాదు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికార యంత్రాంగాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్‌డిఎ కూటమి నేతలు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను ఎన్‌డిఎ నేతలు అరుణ్‌ సింగ్‌, జివిఎల్‌ నరసింహారావు (బిజెపి), కనక మేడల రవీంద్రకుమార్‌ (టిడిపి), నాదెండ్ల మనోహర్‌ (జనసేన) కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) జవహర్‌ రెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పిఎస్‌ ఆర్‌ అంజనేయులు, ఎస్‌పి రిశాంత్‌ రెడ్డి, ఎపి బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి వాసుదేవరెడ్డి, టిటిడి ఇఒ ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం బిజెపి నేత అరుణ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బోగస్‌ ఓట్లను తొలగించాలని కోరామన్నారు. ప్రతిపక్ష నేతల ర్యాలీలకు అనుమతించడం లేదని, హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతినివ్వడం లేదని అన్నారు.

➡️