తిరుమలలోయాత్రికులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినాలు కావడంతో శని, ఆదివారం శ్రీవారి సన్నిధికి యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయి దర్శనం కోసం ఏటీసీ వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

శనివారం స్వామివారిని 74,351 మంది యాత్రికులు దర్శించుకోగా 34, 164 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లు వచ్చిందని వివరించారు.

మార్చి 20 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు యాత్రికకులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు వివరించారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి యాత్రికులకు కనువిందు చేస్తారని తెలిపారు.

➡️