బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : ప్రియాంక గాంధీ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఒడించి బుద్ధి చెప్పాలని..కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా మీ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా నిరూపించాలన్నారు. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని, రైతులు, విద్యార్థులు ఉన్నారని, వారు ఏం కోరుకుంటున్నారో తనకు తెలుసన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కావాలంటే.. మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అందరి విషయాల్లో కేసీఆర్‌ ప్రభుత్వం కళ్లు మూసుకొని నిద్రపోతోందని విమర్శించారు.

➡️