డయేరియాకు మరొకరు బలి!

another victim of diarrhea guntur

మూడుకు చేరినమృతుల సంఖ్య

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో డయేరియా తీవ్రత కొనసాగుతోంది. ప్రభుతాస్పత్రిలో రైలుపేట వాసి మహ్మద్‌ ఇక్బాల్‌ (38) శుక్రవారం వేకువజామున మృతి చెందారు. దీంతో, మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం… వాంతులు, విరోచనాలు అవుతుండడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ఇక్బాల్‌ను కుటుంబసభ్యులు ఈ నెల 11న తరలించారు. 13వ తేదీ వరకూ చికిత్స పొందాక డిశ్ఛార్జు చేశారు. ఇదే సమస్య మళ్లీ ఉత్పన్నం కావడంతో గురువారం రాత్రి కుటుంబసభ్యులు తిరిగి గుంటూరు ప్రభుత్వాసత్ప్రికి తీసుకొచ్చారు. అతిగా విరోచనాలు కావడం వల్ల తీవ్ర అస్వస్తతతో న్యుమోనియా సమస్య వచ్చింది. ప్రభుత్వాస్పత్రిలో పల్మనాలజిస్టులు లేరని, గుంటూరులోని చెస్టు ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. ప్రభుత్వాస్పత్రిలోనే చికిత్స చేయాలని ఇక్బాల్‌ కుటుంబసభ్యులు కోరారు. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

➡️