‘ నా నవ సందేహాలకు జవాబు చెప్పండి ‘ : సిఎం జగన్‌కు షర్మిల ప్రశ్నలు

కడప : ‘ నా నవ సందేహాలకు జవాబు చెప్పండి ‘ అని ఎపి సిఎం జగన్‌కు కడప కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి వైఎస్‌.షర్మిల అడిగారు.

శుక్రవారం కడప ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడుతూ …. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ తీరని అన్యాయం చేశారని అన్నారు. వైఎస్‌ఆర్‌ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే.. జగన్‌ మాత్రం ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. గౌరవంగా బతకాల్సిన ఉద్యోగులను అవమానిస్తున్నారని అన్నారు. బత్స లాంటి వాళ్ళు కాళ్లు పట్టుకొని అడగాలని అంటున్నారని… ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారని, ఉద్యోగుల హక్కులు కాలరాస్తున్నారని, ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కనీసం అపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. ” నవరత్నాలు అని గొప్పగా చెబుతున్నారు.. ఉద్యోగుల విషయంలో తాము అడిగే నవ సందేహాలకు సమాధానం చెప్పాలి ” అని షర్మిల డిమాండ్‌ చేశారు.

నవ సందేహాలు ….

1) అధికారంలో వచ్చాక వారం రోజుల్లో సిపిఎస్‌ విధానం రద్దు చేసి… జిపిఎస్‌ విధానం అమలు చేస్తామని చెప్పారు.. ఎందుకు చేయలేదు ? జిపిఎస్‌ అవసరం లేదు…మాకు కాంగ్రెస్‌ పార్టీ అమల్లోకి తెచ్చిన ఒపిఎస్‌ విధానం అమలు చేయాలి అంటున్నా ఎందుకు వినడం లేదు ?

2) ఒకటో తారీకున జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు… ప్రతి నెల 15 నుంచి 25 మధ్యలో జీతాలు అందుకోవడం ఏంటి ? ఇది అసమర్థ పాలనకు నిదర్శనం కాదా ?

3) 11 వ పిఆర్‌సి కమిషన్‌ లో..మీరు ప్రకటన చేసిన ఐఆర్‌ కంటే ( 27శాతం) తక్కువ ఫిట్‌ మెంట్‌ (23 శాతం) ఇచ్చిన ఘనత మీది కాదా ?

4) 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12 వ పిఆర్‌సి ఇంకా ఎందుకు అమలు చేయలేదు…కేవలం కమిషన్‌ వేశారు… కాలయాపన చేస్తున్నారు. నివేదిక వచ్చే వరకు కొత్త ఐఆర్‌ ఇస్తామని చెప్పారు..ఏమయ్యింది ?

5) హెచ్‌ఆర్‌ఎ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు… జిల్లా స్థాయిలో పని చేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఎ 20 శాతం నుంచి 16 శాతానికి ఎందుకు తగ్గించారు. ?

6) ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.22 వేల కోట్ల పాత బకాయిల సంగతి ఏంటి ?

7) 2022 నుంచి ఇవ్వాల్సిన టిఎ, డిఎ లు రూ.270 కోట్లు 2027 లో చెల్లిస్తాం అని చెప్పడం ఏంటి ?

8) ఉద్యోగులు సరెండర్‌ చేసిన లీవులు బకాయిలు 2500 కోట్లు…ఎప్పుడు చెల్లిస్తారు..?

9) ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రూ.118 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి…వీటి సంగతి ఎంటి ? అని నవ సందేహాల ప్రశ్నలను షర్మిల సంధించారు.

ఉద్యోగస్తులకు అండగా ఉండేది కాంగ్రెస్‌ మాత్రమేనని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక మళ్ళీ పాత ఒపిఎస్‌ విధానాన్ని అమలు చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ చూసుకున్నట్లు ఉద్యోగులను భద్రంగా చూసుకుంటామన్నారు. ఉద్యోగస్తుల డిమాండ్‌ లకు గౌరవం ఉంటుందని చెప్పారు. పెన్షన్‌ పంపిణీ పేరుతో వఅద్ధులను చంపుతున్నారని ఆరోపించారు. ఐఎఎస్‌ లు ప్రభుత్వానికి వైసిపి పార్టీకి మేలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి మళ్ళీ అధికారంలో రాకపోతే పెన్షన్లు ఆగుతాయని సఅష్టిస్తున్నారనీ.. వీళ్లకు జీతాలు ఇచ్చేది వైసిపినా ? ప్రజలా ? అని ప్రశ్నించారు. వైసిపి ఒత్తిడులకు ఐఎఎస్‌ లు తలగ్గుతున్నారని నిప్పులుచెరిగారు.

➡️