పోస్టల్ బ్యాలెట్ పై కసరత్తు

ప్రజాశక్తి-అమరావతి : పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు రూపొందించిన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని పలు అంశాలను ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చించిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి ఏప్రిల్ మరియు మే మాసాల్లో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలను వివరిస్తున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ పాల్గొన్నారు.

➡️