జగద్గిరి గుట్టలో బాలికపై అత్యాచారం..!

Mar 9,2024 12:19 #hydrabad, #police, #rape case
Rajastha 8-year-old schoolgirl gang-raped by driver, his f

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్ట పీఎస్‌ పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భర్త నుంచి విడిపోయిన బాధిత బాలిక తల్లి.. చంద్రశేఖర్‌ అలియాస్‌ సిద్ధుతో సహజీవనం చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. తండ్రి వద్ద పిల్లలు ఉంటుండగా.. దసరా పండుగకు బాలిక తల్లి దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై సిద్ధు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. సిద్ధు వేదింపులు తాళలేక బాధితురాలు తల్లికి చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️