అంగన్వాడీలకు ప్రభుత్వ సిబ్బంది నోటీసులు

Jan 10,2024 12:32 #Anganwadis, #Government staff, #notices

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … గత 30 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మెను చేపట్టారు. సమ్మె కొనసాగుతోన్న క్రమంలో … అంగన్వాడి వర్కర్లు హెల్పర్లకు ప్రభుత్వ సిబ్బంది నోటీసులను అందజేసింది. ‘ ఉద్యోగ నియమ నిబంధన ఉల్లంఘన – తగు క్రమశిక్షణా చర్యలు తీసుకొనుట – సంజాయిషీ కోరుట గురించి ‘ అంటూ … నోటీసులను అంగన్వాడీలకు అందజేశారు. ఆ సమయంలో అంగన్వాడీలు లేకపోతే వారి ఇంటి గోడకు నోటీసును అతికించి వెళుతున్నారు. అంగన్వాడిలు సమ్మెలో పాల్గొన్న కారణంగా కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి తాము నోటీస్‌ ఇచ్చేందుకు వచ్చాము అని చెప్పగా, ఆ కుటుంబస్తులు నిరాకరించారు. సంబంధిత ఉద్యోగులు ఇంట్లో లేరని సమ్మెలో ఉన్నారని తెలపగా సరే తీసుకోకపోతే గోడకు అతికించి వెళతామని తెచ్చిన నోటీసును గోడకు అతికించి వెళుతున్నారు.

Vro మహిళా పోలీస్, vra - అనకాపల్లి
Vro మహిళా పోలీస్, vra – ప్రజాశక్తి బుచ్చయ్యపేట ( అనకాపల్లి జిల్లా)
➡️