అద్దంకిలో మున్సిపల్‌, అంగన్వాడి కార్యకర్తలు అరెస్ట్

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … మంగళవారం ఉదయం మునిసిపల్‌ కార్మికులు, అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో అద్దంకిలోని స్థానిక తహసిల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో కార్యాలయంలోకి ఎవరినీ పోనీయకుండా అధికార సిబ్బంది అడ్డుకున్నారు. న్యాయం జరిగే వరకూ పోరాటాలు చేస్తామని జిల్లా సిపిఎం కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య అన్నారు. పోలీసులు దౌర్జన్యంగా కార్యకర్తలను ఈడ్చుకెళ్లి ఆటోలో ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడే అంగన్వాడి కార్యకర్తలను, మున్సిపల్‌ కార్మికులను విడుదల చేశారు.

➡️