తుఫాను వర్ష భీభత్సం – కూలిన ఉర్దూ పాఠశాల ప్రహరీ గోడ

school wall collapse due to rains

తెరుచుకొని పుట్ పాత్ షాపులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తుఫాను వర్షం విజయనగరం పట్టణంలో భీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పల్లపు ప్రాంతాల్లోనూ, షాపుల్లో నీరు చేరి స్తంభింప చేసింది. మరో వైపు వర్షానికి గత మూడు రోజులుగా నగరంలో ఉన్న పుత్పాత్ షాపులు తెరుచుకోలేదు. దీంతో చిరు వ్యాపారులు వ్యాపారాలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఆబాద్ వీధిలో ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు కూలిపోయింది. మరో వైపు నగరంలో పల్లపు ప్రాంతాల్లోనూ రాజీవ్ నగర కాలనీ, కనపాక యూత్ హాస్టల్ , పావని నగర్, వై ఎస్ ఆర్ నగర్ వెళ్ళే రహదారి,రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరింది. కలెక్టరేట్ కి దగ్గరిలో ఉన్న షాపులో నీరు చేరి షాపులు తెరుచుకోలేదు. గంటస్తంభం వద్ద ఉన్న మార్కెట్ లోకి వర్షపు నీరు చేరడంతో షాపులు తెరుచుకోలేదు.

➡️