యూత్‌ కాంగ్రెస్‌ నేతల ఆందోళన.. ఉప్పల్‌ స్టేడియం ఉద్రిక్తత

హైదరాబాద్‌ :ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్‌ సీజన్‌-17 లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ కు సంబందించి టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్‌ లో అమ్మారంటూ యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఐపీఎల్‌ టికెట్లను అక్రమంగా అమ్ముకున్న జగన్మోహన్‌ రావును వెంటనే సస్పెండ్‌ చేయాలని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నిరసన కారులు స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

➡️