అప్పర్‌ సీలేరులో అంకెల గారడీ

Jan 4,2024 09:06 #AP Economy, #Irrigation Projects
upper sileru expenditure

 

  • అంచనా వ్యయంలో భారీగా మార్పులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అప్పర్‌ సీలేరు విద్యుత్‌ కేంద్రంలో అంకెల గారడీ చోటుచేసుకుంటోంది. అంచనా వ్యయాన్ని ఎప్పుడు పెంచుతారో… ఎప్పుడు తగ్గిస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మరోసారి కొత్త అంచనాలను రూపొందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ని సీలేరులో 150 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యంలో తొమ్మిది పంప్‌డ్‌ స్టోరేజి విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు 2019లోనే నిర్ణయిరచారు. తరువాత ఈ ప్రాజెక్టును రూ. 10,445 కోట్ల అరచ నా వ్యయంతో ప్రతిపాదిర చారు. మరో ఏడాది తరువాత 2021 అక్టోబర్‌లో దీనికి సూత్రప్రాయ అనుమతి కూడా లభించిది. 2022 డిసెంబర్‌లో ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా పూర్తి అనుమతులు జారీ చేసింది. అయితే మురదుగా అనుకున్న దానికంటే కొరత అంచనా వ్యయాన్ని తగ్గిరచి రూ.11,881 కోట్లకు మాత్రమే అనుమతినివ్వడం విశేషం. అదే నెలలో వాప్కోస్‌ నురచి పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్‌ కూడా అరదింది. ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.9,505 కోట్ల రుణానికి కసరత్తు ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును జ్యుడీషియల్‌ రివ్యూకి పంపిరచారు. అదే నెలలో ప్రాజెక్టుకి సంబంధిరచిన ఎస్టిమేటెడ్‌ కాంట్రాక్ట్‌ వేల్యూని రూ.7,860 కోట్లతో మరోసారి న్యాయ సమీక్షకు సమర్పిరచారు. ఈ సమయంలోనే ప్రాజెక్టుకు సంబంధించి రూ.11,154 కోట్లకు టిఇసి (టెక్నో ఎకనామిక్‌ కాన్కరెన్స్‌) రావడం విశేషం. ఆ తరువాత జూన్‌లో జరిగిన బోర్డు సమా వేశంలో ప్రాజెక్టు సైకిల్‌ ఎఫిషియన్సీ 68.6 శాతం గా అంచనా వేస్తూ ఒక్కసారిగా అరచనా విలువను జిఎస్‌టి కలపకుండా రూ. 6,717 కోట్లకు కుదిరచారు.ఆర్‌ఇసి నుంచి 8,919 కోట్లుఇదే సమయంలో గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఇసి) నురచి రూ. 8,919 కోట్ల రుణం మంజూరు కావడం విశేషం. అలాగే గత అక్టోబర్‌లో పంప్‌ టర్బయిన్‌ వెయిటెడ్‌ సామర్థ్యాన్ని 91.4 శాతం నురచి 90 శాతానికి మార్పు చేసేలా వాప్కోస్‌కు రాష్ట్ర అధికారులు సూచించారు. అలాగే డిసెంబర్‌ 11న బోర్డుకు కొత్త ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించడం గమనార్హం. ఈ ప్రతిపాదనల్లోనే ప్రాజెక్టు అరచనా వ్యయాన్ని ఏకంగా రూ.12,271 కోట్లకు పెంచి ప్రతిపాదించారు. దీనిపైనే మరోసారి ఎల్‌-1గా వచ్చిన మెఘా ఇంజనీరిరగ్‌ సంస్థతో జరిగిన చర్చల్లో కేవలం సివిల్‌ పనులు, ఇ అరడ్‌ ఎం పనులకు రూ. 7,383.60 (జిఎస్‌టి లేకుండా) కోట్లకు టెరడర్‌ ఖరారు చేయగా, మెఘా నురచి 3.60 కోట్లు డిస్కౌరట్‌ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. . ఈ మొత్తానికి అదనంగా సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనుమతులకు, , ఆ సంస్థకు చెల్లిరచాల్సిన ఇతర మొత్తం, 18 శాతం జిఎస్‌టి, ఐదేళ్ల కాలానికి సంబంధిరచి ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీలు కలుపుకొని మొత్తం ప్రాజెక్టు విలువ 12,264 కోట్లుగా ఖరారు. .

➡️