కార్మిక సంఘాల భారీ ర్యాలీ

Jan 9,2024 17:39 #CITU, #Dharna, #muncipal workers

ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి-జిల్లా) : సూళ్లూరుపేట మున్సిపాలిటీలో గత 15 రోజులుగా సిఐటియు ఆధ్వర్యములో సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే.మునిసిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ కార్మికులను,యూనియన్ నాయకులను మంగళవారం పిలిపించి రాయబారం చేశారు. మున్సిపాలిటీలో పారిశుధ్యం చాలా ఇబ్బందికరంగా వుందని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,దగ్గర్లోనే పండుగలు కూడా ఉన్నాయని, కాబట్టి కొంతమంది అయినా పని చేయాలని కోరారు. అందుకు ప్రతిగా వారికి రావాల్సినటువంటి వేతనాలు రాయితీలు సక్రమంగా ఏర్పాటు చేస్తానన్నారు.రాష్ట్ర కార్మిక నాయకులు పిలుపుమేరకు సమ్మెలోనే ఉంటామని,ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్నామే తప్పా కొత్తగా మేము ఏమి కోరడం లేదని,ఇప్పుడు ఎవరు స్వంతంగా ఏ హామీలు ఇచ్చినా అవి ఆమలయ్యే పరిస్థితి లేదని,ప్రజలు అధికారులు సానుభూతితో కార్మికులు డిమాండ్లను తీర్చేంతవరకు సానుభూతితో సహకరించాలని ఆయనకి నాయకులు విన్నవించారు.కార్మికులు సమ్మెను కొనసాగిస్తే తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కమిషనర్ తెలిపారు.దానికి ఇప్పటికే కొంతమంది పనిచేస్తున్నారని వారిని మేమేమి అడ్డు పెట్టడం లేదని అలాగే కౌన్సిలర్లు ముందుకు వచ్చి టౌను పారిశుధ్యాన్ని పరివేక్షిస్తున్నా మేము అడ్డుపడడము లేదన్నారు.ఫెడరేషన్ పిలుపు మేరకు సమ్మె సాగుతుందన్నారు.

ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు భారీ ర్యాలీ…

సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిఐటియు కార్యాలయం నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు సిఐటియు,మునిసిపల్, అంగన్వాడి,ప్రజాసంఘాలు, అన్ని కార్మిక సంఘాలు ఏకమై మంగళవారం భారీ ర్యాలీని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బి. పద్మనాభయ్య,కె. సాంబశివయ్య మండల కార్యదర్శి కె.లక్ష్మయ్య,సుంకర అల్లేయ్య,పి.మనోహరం,మునె య్య,తదితర కార్మికులు పాల్గొన్నారు.

➡️