ప్రతిపక్షనేతలను లక్ష్యంగా చేసుకున్న ఎన్నికల అధికారులు : కాంగ్రెస్‌

న్యూఢిల్లీ :    బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ నేతలను స్వేచ్ఛగా వదిలేస్తూ.. ప్రతిపక్ష నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్‌ ఆదివారం మండిపడింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున్‌ ఖర్గే హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఖర్గే ముజఫర్‌పూర్‌, సమస్తిపూర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

కేరళలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారని, ఇప్పుడు ఖర్గే హెలికాప్టర్‌ను తనిఖీ చేశారని కాంగ్రెస్‌ నేత రాజేష్‌ రాథోర్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఖర్గే హెలికాప్టర్‌ తనిఖీని బీహార్‌ ఎన్నికల అధికారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.

కాంగ్రెస్‌ నేతల హెలికాప్టర్‌లు తనిఖీ చేయడం సాధారణమేనా, ఎన్‌డిఎ అగ్ర నేతలపై కూడా ఇలాంటి తనిఖీలు జరిగాయా అని ఎన్నికల కమిషన్‌ (ఇసి) వెల్లడించాలని రాథోర్‌ పేర్కొన్నారు. తనిఖీ చేసిన నేతలందరి వీడియోలను ఇసి బయటపెట్టాని అన్నారు.

➡️