TS Polling : తెలంగాణలో హస్తం హవా

telangana polling 2023
  • హైదరాబాదులోని మొత్తం 29 స్థానాల్లో 17 స్థానాలను బిఆర్ఎస్ గెలుచుకుంది
  • మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ విజయం
  • 14 మంది మంత్రులలో ఆరుగురు ఓటమి పాలయ్యారు
  • కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు
  • ఎల్బీనగర్లో బిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయం
  • కూకట్ పల్లిలో మాధవరావు కృష్ణారావు 64 వేల మెజార్టీతో గెలుపు
  • మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు
  • బండి సంజయ్ ఓటమి
  • చేవెళ్లలో బిఆర్ఎస్ అభ్యర్థి విజయం
  • సిరిసిల్లలో కేటీఆర్ విజయం
  • ముధోల్ బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ గెలుపు
  • LBనగర్లో బిఆర్ఎస్ అభ్యర్థి 16700 ఓట్లతో ముందంజలో ఉన్నారు
  • రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ డిమాండ్
  • సత్తుపల్లిలో 17892 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
  • ఖానాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి బొజ్జ విజయం
  • వైరాలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
  • ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య విజయం సాధించారు.
  • నాగల్ కర్నూల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుంట్ల రాజశేఖర్ రెడ్డి గెలుపు
  • దుబ్బాకలో బిజెపి అభ్యర్థి రఘునాథన్ రావు ఓటమి
  • వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం
  • చేవెళ్లలో ఫలితం పై ఉత్కంఠ నెలకొంది. 19 రౌండ్ ముగిసే సమయానికి 546 ఓట్ల  ఆధిక్యంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. ఆరువేల మెజార్టీ నుండి 500కు పడిపోయిన తరుణంలో గెలుపు పై ఉత్కంఠ నెలకొంది.
  • కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు
  • సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి 5534 ఓట్లతో ముందంజలో ఉన్నారు
  • ముషీరాబాద్ లో 23 వేల ఓట్ల ఆధిక్యంలో బిఆర్ఎస్ అభ్యర్థి
  • మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు విజయం
  • తాండూర్ లో బిఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ విజయం
  • అదిలాబాదులో భారీ మెజార్టీ దిశగా గడ్డం వివేక్ బ్రదర్స్
  • మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు.
  • నల్గొండలో 54 వేల పైగా మెజార్టీతో వెంకటరెడ్డి విజయం సాధించారు.
  • భారీ మెజార్టీతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఘనవిజయం
  • కొడంగల్ లో రేవంత్ రెడ్డి విజయం. 32,800 ఓట్ల మెజార్టీతో రేవంత్ గెలుపొందారు.
  • నారాయణఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి 5,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు
  • వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
  • ఇబ్రహీంపట్నంలో 25 వేల ఓట్లకు పైగా మెజారిటీ లో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి
  • సికింద్రాబాద్లో బిఆర్ఎస్ అభ్యర్థి 34 వేల ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు
  • నిర్మల్ లో  విజయం దిశగా బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి
  • జుక్కల్ లో  కాంగ్రెస్ గెలుపు. 78 ఓట్ల తేడాతో విజయం సాధించిన తోట లక్ష్మీనారాయణ
  • మధిరలో  22 వేల ఓట్ల మెజారిటీతో భట్టి విక్రమార్క ముందంజ
  • నర్సంపేటలో 10,600 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
  • బాల్కొండ లో మూడు వేల ఓట్ల మెజార్టీతో మంత్రి ప్రశాంత్ రెడ్డి విజయం
  • కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గాంధీభవన్ కు చేరుకున్నారు. గాంధీభవన్లో కాంగ్రెస్ సంబరాలు.
  • గజ్వేల్, హుజూరాబాద్ లలో ఓటమి దిశగా బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్
  • నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం
  • అంబర్ పేటలో బిఆర్ఎస్ అభ్యర్థి విజయం.
  • భద్రాచలంలో బిఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం.
  • తెలంగాణ డిపాజిట్లు కూడా రాని స్థితిలో జనసేన అభ్యర్థులు
  • రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
  • ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య  విజయం సాధించారు.
  • చార్మినార్ లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ విజయం సాధించారు.
  • ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 18 ఓట్లతో ముందంజ.
  • తెలంగాణ ఎన్నికల్లో బోణి కొట్టిన కాంగ్రెస్. అశ్వరావుపేటలో  కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ 28 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కు అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ 9 స్థానాల్లో, సిపిఐ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
    -> ఉమ్మడి వరంగల్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది.
    -> అలంపూర్ లో 1500 ఓట్లతో బిఆర్ఎస్ ముందంజ
    -> పినపాకలో 3196 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ..
    -> జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ముందంజ,
    -> ఇబ్రహీంపట్నంలో కాంగ్రస్ ముందంజ
    -> దుబ్బాక, పఠాన్ చెరువు లో బిఆర్ఎస్ ముందంజ

తెలంగాణ : 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా సాగుతుంది. తెలంగాణలోని కామారెడ్డి, కొడంగల్ రెండు స్థానాలలో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కొడంగల్ లో మూడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ కు 4389 ఓట్ల ఆధిక్యం లో ఉన్నారు. కామారెడ్డిలో కెసిఆర్ వెనుకంజలో ఉన్నారు. హైదరాబాద్, మెదక్ జిల్లాలో బి.ఆర్.ఎస్ ముందంజలో ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. హుజురాబాద్ లో ఈటెల వెనుకంజలో ఉన్నారు.

➡️