96.67 శాతం పింఛను పంపిణీ పూర్తి

May 2,2024 23:38 #ap government, #Pension

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తొలి రెండు రోజుల్లో 96.67 శాతం పింఛను పంపిణీ పూర్తయిందని, గురువారం సాయంత్రం వరకు మొత్తం 63,31,470 మందికి పింఛను అందించామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌ వెల్లడించారు. మే ఒకటినే డైరెక్టు బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) ద్వారా 48,17,718 మందికి పింఛను పంపిణీ జరిగిందని, వీరందరికీ నేరుగా నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇక 15,13,752 మందికి ఇంటి వద్దే పంపిణీ చేశామని, మిగిలిన వారందరికీ మే 4 లోపు పంపిణీ పూర్తి చేస్తామని ఆయన వివరించారు. డిబిటిలో 74,399 మందికి నగదు ట్రాన్స్‌ఫర్‌ కాలేదని, వారందరికీ ఇళ్లవద్దే పంపిణీ ఉంటుందని తెలిపారు. పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.1,954.39 కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు.

➡️