సమ్మె విచ్ఛినాన్నికి కుట్ర

municipal workers strike 6th day

– పోటీ కార్మికులతో పని

– అడ్డుకున్న మున్సిపల్‌ కార్మికులు

– పల్నాడులో ట్రాక్టర్‌తో డి

– విశాఖలో 300 మంది అరెస్టు

ప్రజాశక్తి – యంత్రాంగం మున్సిపల్‌ కార్మికుల సమ్మె విచ్ఛినాన్నికి అధికారులు ప్రయత్నించారు. పోటీ కార్మికులతో చెత్త వాహనాలను బయటకు తీసేందుకు యత్నించగా సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. పలు చోట్ల కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. అనంతరం విడుదల చేశారు. పల్నాడులో పోటీ కార్మికుడు మున్సిపల్‌ కార్మికుడిని ట్రాక్టర్‌తో డీకొట్టారు. సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగుతుందని, పోటీ కార్మికులను అడ్డుకుంటామని మున్సిపల్‌ కార్మికులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు, నల్ల దుస్తులు, ఉరితాళ్లతో కార్మికులు నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోటీ కార్మికులతో చేయిస్తున్న పనులను మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్‌కు అడ్డుగా కార్మికుడు మోషే నిలిచాడు. పోటీ కార్మికుడు దురుసుగా ప్రవర్తిస్తూ ట్రాక్టర్‌ను ముందుకు నడపుతూ మోషేను డీ కొట్టాడు. దీంతో గాయపడిన ఆయనను తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించారు. మోషే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై ట్రాక్టర్‌ డ్రైవర్‌పై పోలీసులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం గేట్లు మూసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.విశాఖ జివిఎంసి పరిధిలో పోటీ డ్రైవర్లను పెట్టి వాహనాలను తీయడంతో పలుచోట్ల మున్సిపల్‌ కార్మికులు అభ్యంతరాలు తెలిపి, అడ్డగించారు. దీంతో ఎక్కడకక్కడ పోలీసులు మోహరించి కార్మికులను అరెస్టులు చేశారు. జివిఎంసి పరిధిలోని ఎనిమిది జోన్లల్లో 300 మంది కార్మికులను అరెస్టు చేశారు. గాజువాకలో సిఐటియు నేత ఎం.రాంబాబును వేకువజామున మూడు గంటలకే అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఒంగోలులో పలు పారిశుధ్య డివిజన్‌లలో పోటీ కార్మికులతో పని చేయించేందుకు అధికారులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. పోలీసు పహారాలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలను కార్మికులు తిప్పకొట్టారు. కొన్ని చోట్ల క్యాబ్‌ ఆటోల ద్వారా చెత్త సేకరణకు అధికారులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. చెత్త ఆటోలు, ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చొని నిరసన తెలియజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కార్మికులతో మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌, ఛైర్‌పర్సన్‌ శ్రీమంతరెడ్డి చర్చలు జరిపారు. బబ్బిలి, కర్నూలు జిల్లా గూడూరులో బయటి వ్యక్తులతో పారిశుధ్య పనులు చేయించేందుకు ప్రయత్నించగా మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు.ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలో ధర్నాచౌక్‌ వద్ద వేలాది మంది పారిశుధ్య కార్మికులు ధర్నా, మానవహారం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సిహెచ్‌.బాబూరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్‌, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, అంగన్‌డీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మద్దతిచ్చారు.

municipal workers strike 6th day prakasam

ఒంగోలులో మున్సిపల్ కార్మికులు ఐదో రోజు సమ్మెలో భాగంగా కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.  ఈరోజు కార్యక్రమానికి కే శ్రీనివాసరావు అధ్యక్ష వహించారు. ఐదో రోజు సమ్మెను సిఐటియు నగర ఉపాధ్యక్షులు ప్రారంభించి మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తను చెప్పిన హామీలు అమలు చేయాలని ఈరోజు కనీసం బతకటానికి 26000 కనీసం చేస్తున్న ఇవ్వాలని, శాశ్వత స్వభావములో ఔట్సోర్సింగ్ కార్మికులు ఉండకూడదని ప్రభుత్వాలే చెబుతున్నాయి. కానీ మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ చేయకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. సమ్మెకు మద్దతుగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం  మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ న్యాయం చేస్తానని స్వచ్ఛ భారత్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు కార్మికుల చేత ఎట్టి చాకిరి చేయించుకొని ఈరోజు మున్సిపల్ కార్మికులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు ఎట్లా వస్తాయని మున్సిపాలిటీలో పనిచేసే ఎక్కువ శాతం కార్మికులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని ఈ పేదల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి కనికరం లేకుండా ప్రమాణాలు చేసి మరిచిపోవటం పరిపాటిగా ఉందని పక్కన బెంగళూరు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేశారని ఈ విషయం మన ముఖ్యమంత్రికి తెలియదా ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించాలని లేనిపక్షంలో బడుగు బలహీన వర్గాల ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. సిఐటియు నగర ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ కోసం పోరాటం చేస్తుంటే కోవిడ్ కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోతే కనీసం క్రిస్టమస్ ఇవ్వకుండా ఈరోజు పోటీ కార్మికుల తెచ్చి 700 రూపాయలు డబ్బులు చెక్కుల రూపంలో ఇస్తున్నారని మున్సిపల్ కార్మికులు ఈపీఎఫ్.ఈఎస్ఐ సమస్య మీద ఒంగోలు మున్సిపాలిటీకి అనేకసార్లు తిరిగినా పరిష్కారం చేయని ఈ కమిషనర్  పోటీ కార్మికుల తీసుకొచ్చి డబ్బులు ఇవ్వటం సరికాదని పెండింగ్ లో ఉన్న కోవిడ్ కార్మిక జీతాలు ఎన్ని ఇవ్వాలని ఆయన అన్నారు. మున్సిపల్ జిల్లా గౌరవ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేటర్లు మేయర్లు రోడ్లు సచివాలయం సిబ్బందిని రోడ్లు సింహాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయని ఈరోజు రోడ్లు చిమ్మకుండా ఫోటోలకు పేపర్లు ఇవ్వడం తప్ప కుళ్లిపోయిన కాలువలో మురికిని తొలగించాలని ఈ మున్సిపల్ అధికారులకు కార్పొరేటర్లకు ఆయన హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని లేనిపక్షంలో జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర్ ఉపాధ్యక్షులు ఎస్ డి హుస్సేన్. ఏ శ్రీనివాసరావు, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కే గోపి, యు కుమారి, ఈ విజయమ్మ, కే వెంకటేశ్వర్లు, ఆర్ శ్రీనివాసరావు, కే బాలకృష్ణ, శ్రీలక్ష్మి, కే కమల, బి దివ్య, ఎం లక్ష్మీకాంతం, కోటేశ్వరి, మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు.

municipal workers strike 6th day tpt

  • మున్సిపల్ కార్మికులు 5వ రోజు చేరిన సమ్మె…

తిరుపతి – సూళ్లూరుపేట : సూళ్లూరుపేట మున్సిపల్ కార్మిక లీడర్లను కమిషనర్ పిలిపించి మాట్లాడుతూ డ్రైవర్లు డ్యూటీకి రావాలని లేదంటే తానే ఎంతోకాలం వారి కలిగించిన సౌలభ్యం అంటే నెలకు 21000 వేతనం తీసుకుంటూ డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు డ్రైవర్ గా అయితే 15 వేలే వస్తుందన్నారు.దీన్ని నేను తగ్గిస్తాను అని గట్టిగా చెప్పడం జరిగింది. దీనికి మున్సిపల్ గౌరవ అధ్యక్షులు కె.  సాంబశివయ్య, సిఐటియు కార్యదర్శి కె.లక్ష్మయ్య మున్సిపల్ కార్మికులు అంగీకరించలేదు.అంతే కాకుండా ఇప్పటికే రాజకీయ నాయకులు అధికారులు ఇళ్లలో పని చేసే వారిని బలవంతంగా పనిలో ఆపలేదని ఆ విధంగా కొంత వెసలు బాటు కల్పించామని అంతేకాకుండా ఇంజనీరింగ్ కార్మికుల్ని పనుల్లో ఉండి, వాళ్లు ఖాళీగా ఉన్నప్పుడే వచ్చి సమ్మెకు సంఘీభావం తెలపుతున్నారని చెప్పాము. పన్నులు చెల్లించాలని ఆటో అడ్వర్టైజ్మెంట్ ను ఆపినట్టుగా చెప్పారు. మేము చేయలేదనని, కార్మికులు మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికే ఈ పద్దతి అవలంభిస్తున్నారని నాయకులు తెలిపారు. బలవంతంగా పోటీ కార్మికులను దింపడానికి ప్రయత్నము జరుగుతుంది. దీన్ని సామరస్యంగా పరిష్కరించాలని నిర్ణయించారు.డ్రైవర్ సోదర్లు ఉద్యమంలో కొనసాగుతామన్నరని తెలిపారు.

 

municipal workers strike 6th day tenali

గుంటూరు జిల్లా – మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా తెనాలి పురపాలక సంఘ కార్యాలయం ఎదుట మెడకు ఉరితాళ్లతో కార్మికులు నిరసన తెలిపారు.

 

municipal workers strike 6th day

శ్రీ సత్య సాయి జిల్లా – హిందూపురం కౌన్సిల్ సమావేశంలో తమ సమస్యలను చర్చించాలని కౌన్సిల్ హాల్లోకి వస్తున్న కార్మికులను అడ్డుకున్న పోలీసులు. తోపులాట….

municipal workers strike 6th day anna

  • కళ్లకు గంతలు కట్టుకొని మునిసిపల్ కార్మికుల నిరసన
  • సంఘీభావం తెలిపిన కాంగ్రెస్, జనసేన పార్టీలు

అన్నమయ్య జిల్లా-రాజంపేట అర్బన్ : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మె శనివారానికి 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు శనివారం పురపాలక కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గ బాధ్యులు పూల భాస్కర్, సమన్వయ కమిటీ సభ్యులు శెట్టిపల్లి సన్నీ నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపి రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

  • సంఘీభావం తెలిపిన యల్లటూరు శ్రీనివాసరాజు

మాజీ డిఆర్డిఏ అధికారి, రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు శనివారం పారిశుధ్య కార్మికుల సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు డిమాండ్ చేస్తున్న కోరికలన్నీ న్యాయబద్ధమైనవేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఫర్ డిమాండ్లు నెరవేరే వరకు కార్మికుల పోరాటానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పారిశుధ్య కార్మికులు ఉండటానికి వసతి లేక అవస్థలు పడుతున్నారని, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వారందరికీ సామూహిక వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్, మాజీ జెడ్పిటిసి, జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, కోలాటం హరి తదితరులు పాల్గొన్నారు.

 

municipal workers strike 6th day eluru

మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా శనివారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్న కార్మికులు.

 

municipal workers strike 6th day

పశ్చిమ గోదావరి జిల్లా-తాడేపల్లిగూడెం : సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి ఐదవరోజు సమ్మెలో పాల్గొన్న మున్సిపల్ కార్మికులు

municipal workers strike 6th day. a

మున్సిపల్ కమిషనర్ కు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్మికులు…

 

municipal workers strike 6th day konaseema

  • నల్ల రిబ్బన్లతో పారిశుధ్య కార్మికులు నిరసన
    5వ రోజుకు పారిశుధ్య కార్మికులు సమ్మె

డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ – మండపేట : తమ సమస్యల తక్షణo పరిష్కరించాలని నల్ల రిబ్బన్లు కళ్ళకు కట్టుకుని మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు నిరసన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా నాయకులు ఎం.భాస్కరరావు మాట్లాడుతూ నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల రాతలు మారడం లేదన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. మరిన్ని సంఘాలను కలుపుకొని డిమాండ్ల సాధన లక్ష్యంగా సమ్మె ఉధృతం చేసేందుకు ముందుకు సాగుతున్నమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ తదితరులు పాల్గొన్నారు.

 

municipal workers strike 6th day visakha

  • మున్సిపల్ కార్మికుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు 

విశాఖ : తమ సమస్యల పరిష్కారానికై కెఅర్ ఎం కాలనీ సచివాలయం వద్ద దీక్ష చేస్తున్న సుమారు 40 మంది సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసి ఎంవిపి కాలనీ పోలీస్ కు తరలించారు.

➡️