తెగించి పోరాడితేనే మహిళలకు రక్షణ : సీహెచ్ నర్సింగరావు

Mar 10,2024 14:40 #CH Narsingrao, #CITU, #vijayanagaram
  • పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి
  • విజయనగరంలో ప్రదర్శన,సదస్సులో పిలుపు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మహిళలపై నేడు జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా,మహిళలు హక్కులు కాపాడుకోవడం కోసం తెగించి పోరాడితే తప్ప రక్షణ లేదని.. ప్రజాసంఘాలు సహకారంతో హక్కులు రక్షణకు ఉద్యమించాలని సి ఐ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఐద్వా, సిఐటియు, యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నుంచి కెఎల్ పురంలో ఉన్న ప్రజాసంఘాలు కార్యాలయం వరకు ప్రదర్శన అనంతరం శ్రామిక మహిళా సంఘం కన్వీనర్ వి.లక్ష్మి అధ్యక్షతన సదస్సు జరిగింది. సదస్సులో ఆయన మాట్లాడుతూ నేడు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు పట్ల చిన్న చూపు చూస్తూ పురుషాధిక్యత పాలన సాగిస్తున్నారని అన్నారు. పని చేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పని ప్రదేశాల్లో ప్రత్యక్షంగా గాని,పరోక్షంగా గానీ మహిలలుపై వేధింపులకు పాల్పడితే అరెస్టు చేసి జైల్ శిక్ష విధించాల్సి ఉందన్నారు.

అందుకు ఉదాహరణ విజయనగరం జిల్లాలో బయోటెక్ కంపనీలో పార్వతి అనే మహిళకు కంపనీలో హెచ్ అర్ వేదింపులకు పాల్పడటం జరిగింది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు పిర్యాదు చేసినా మూడేళ్ల అవుతున్నా పట్టించుకోకపోవడం అధికారులు,పాలకులు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పార్వతికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని అన్నారు.ఆమె పోరాటానికి మహిళలు అండగా నిలబడాలని కోరారు. మహిళలు కు ఏ విధమైన సమస్య అన్నా సి ఐ టి యు వారికి అండగా ఉంటుందన్నారు. పరిశ్రమలలో లైంగిక వేదింపులు నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది,కానీ ఏ కంపెనీలో కమిటీలు లేవన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా అమలకు నోచుకోవడం లేదన్నారు. మరో వైపు గృహ హింసకు మహిళలు అధిక సంఖ్యలో గురోవుతున్నరన్నారు. గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మనువాద సిద్దాంతాన్ని అమలు చేస్తూ వంట ఇంటికి పరిమితం చేసే విధంగా మోడీ పాలన సాగుతుందన్నారు.. మరో వైపు మహిళా కార్మికులకు,ఉద్యోగులకు పని ప్రదేశాల్లో కనీస హక్కులు ,సౌకర్యాలు లేకుండా పోయిందన్నారు.మహిళలు హక్కులను హరించే విధంగా జరుగుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మహిళలు హక్కులు కోసం,రక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళలు హక్కులు కోసం, రక్షణ కోసం చేసే పోరాటాలకు సి ఐ టి యు అండగా ఉంటుందన్నారు. అనంతరం యు టి ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు అణిచివేత ధోరణి పెరిగిందన్నారు. మహిళలను అక్రమ రవాణాలో, లైంగిక వేదింపులు లో, బ్రునా హత్యల్లో ప్రపంచంలో భారత దేశం మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రతి సంవత్సరం 6 లక్షలు మంది విదేశాలకు రవాణా అవుతున్నరంటే పరిస్తితి ఎంత దయనీయంగా ఉందో చూడాలన్నారు. ప్రతి ఏడాది 20 లక్షలు మంది మహిళలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారన్నారు.ఇంతకంటే మహిళలు పట్ల వివక్షకు నిదర్సనం ఎముందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పెట్టారు తప్పా అమలు చేయలేదంటే మహిళలు పట్ల బిజెపి ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. మహిళలు పై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా,హక్కులు కాపాడుకోవడం కోసం,రక్షణ కోసం ఐక్య ఉద్యమాలు అవసరమని,అందుకు మహిళా లోకం ఏకతాటిపైకి రావాలని కోరారు. అనంతరం సదస్సులో ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ, జె వి వి సమతా విభాగం కన్వీనర్ జి.నిర్మల, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సౌమ్య, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సే యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్.అనసూయ మాట్లాడుతూ మహిళలు ఐక్య మత్యమతోనే ఉద్యమిస్తెనే రక్షణ ఉంటుందన్నారు. ప్రభుత్వాలు మహిళలను ఆట వస్తువులుగా,సరుకుగా చూస్తున్నయన్నరు.మాటలకే మహిళలు సమానమని చెప్పడం తప్ప అన్ని రంగాల్లో మహిళలు పట్ల చిన్న చూపు కొనసాగుతూనే ఉందన్నారు. మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే ఆ నాడు మహిళలు చేసిన పోరాట ఫలితంగా సాధించుకున్న పని గంటలు,మహిళలు హక్కులు నిలబెట్టుకోవడం కోసం ఉద్యమించాలని,అందు కోసం ఐక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. సదస్సుకు యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి.మోహనరావు,ఎపి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, నగర కార్యదర్శి బి.రమణ,యు టి ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ పట్నాయక్, జె ఏ వి అర్ కె ఈశ్వరరావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

➡️