తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

Mar 10,2024 10:31 #arrested, #fishermen, #srilanka, #Tamil Nadu

తమిళనాడు : తమిళనాడు పుదుకోట్టై జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులను ఆదివారం తెల్లవారుజామున చేపలు వేటలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారులు శనివారం ఉదయం జెగతపట్టినం ఫిషింగ్ హార్బర్ నుండి IND TN08 MM 0054, IND TN18 MM 1862 రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన రెండు మెకనైజ్డ్ బోట్లలో బయలుదేరారు. వారు ఆదివారం తెల్లవారుజామున ‘నెడుంతీవు’ సమీపంలో చేపలు పడుతుండగా, శ్రీలంక నావికాదళం చేపల వేటలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై వారిని అరెస్టు చేసింది. మత్స్యకారులను వారి మెకనైజ్డ్ బోట్‌లతో పాటు కంకేసంతురై నేవల్ బేస్‌కు తరలించినట్లు కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ వర్గాలు తెలిపాయి.

అరెస్టయిన మత్స్యకారుల పేర్లు : ఎస్.కాలియప్పన్ (53), పి.అఖిలన్ (18), పి.కోడి మారి (65), ఎస్. షేక్ అబ్దుల్లా (35), కె.తంగరాజ్ (54), ఎ. జయరామన్‌ (40), S.శరవణన్ (24).

➡️